క్రీడా స్ఫూర్తితోనే దేశం ముందంజ

Prajasakti

Prajasakti

Author 2019-10-01 03:59:21

img

* బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌
హైదరాబాద్‌ : ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి వెళ్లివిరిసినప్పుడే దేశం ముందంజలో ఉంటుందని పద్మభూషణ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి కనపరిచేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ గచ్చిబౌలీలోని ఎఎంపి శరత్‌ క్యాపిటల్‌ మాల్‌లో యోనెక్స్‌ బ్రాండ్‌ అవుట్‌ లెట్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ క్రీడల ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ధఢత్వం సాధిస్తామని అన్నారు. ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ యోనెక్స్‌ క్రీడా సామాగ్రి హైదరాబాద్‌లో అందుబాటులోకి రావటం సంతోషించదగిన అంశమని అన్నారు. క్రీడ రంగంలో రాణించాలంటే పట్టుదల కూడా వుండాలని చెప్పారు. అనంతరం ఆయన షోరూంలో సామాగ్రి కిట్స్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ప్రణరు, సమీర్‌ వర్మ, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN