క్షయవ్యాధిని సంపూర్ణంగా నివారించాలి

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-05 02:10:49

హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో క్షయవ్యాధిని సంపూర్ణంగా నివారించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్యులను కోరారు. శుక్రవారం ఇక్కడ ఆమె క్షయవ్యాధి నివారణకు కృషి చేస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయవ్యాధిని మందులతో నివారించవచ్చని, దీనిపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. క్షయవ్యాధిపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ఔషధాలు వచ్చాయన్నారు. టీబీ వ్యాధి సోకిన రోగులు మందులను ఆపకుండా తీసుకోవాలన్నారు. వైద్యుల సూచనల మేరకు ఔషధాలను వాడాలన్నారు. రాష్ట్రంలో టీబీ కేసులను తగ్గించాలన్నారు. ఈ వ్యాధిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. కార్పోరేట్ రంగం కూడా టీబీ వ్యాధి నివారణకు కృషి చేస్తున్న వారికి సహకరించాలన్నారు. తెలంగాణలో 2025 నాటికి క్షయవ్యాధిని సంపూర్ణంగా లేకుండా చేయాలన్నారు. టీబీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చేపట్టిన వైద్యసేవలను ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీబీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అదనపు డైరెక్టర్ డాక్టర్ టీవీ వెంకటేశ్వర్లు, ప్రజారోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD