ఖలీల్‌పై అభిమానులు ఫైర్

Mana Telangana

Mana Telangana

Author 2019-11-09 02:46:52

img

రాజ్‌కోట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో చెత్త బౌలింగ్‌తో సతమతమవుతున్న యువ స్పీడ్‌స్టర్ ఖలీల్ అహ్మద్‌పై అభిమానులు ఫైర్ అయ్యారు. వరుసగా రెండు మ్యాచుల్లోనూ భారీగా పరుగులు సమర్పించుకోవడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఖలీల్ విఫలమయ్యాడని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి బౌలింగ్‌నే కనబరిస్తే టీమిండియాలో చోటు కాపాడు కోవడం కష్టమని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఖలీల్ తన బౌలింగ్‌ను మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు.

తొలి మ్యాచ్‌లో ఖలీల్ ఒకే ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లు ఇచ్చుకున్నాడు. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో టి20లోనూ మరోసారి వరుసగా మూడు బంతుల్లో 3 ఫోర్లను సమర్పించుకున్నాడు. అంతేగాక రెండు మ్యాచుల్లో కలిపి ఏకంగా 80కి పైగా పరుగులు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇచ్చేశాడు. దీంతో ఖలీల్ బౌలింగ్ తీరుపై అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. అతన్ని తప్పించి మరో బౌలర్‌కి ఛాన్స్ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.

Khaleel Ahmed was Trolled on Twitter

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD