గంగూలీ పదవీకాలం పొడిగించాలి

Nava Telangana

Nava Telangana

Author 2019-10-20 02:24:18

- మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌
ముంబయి: బిసిసిఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న సౌరబ్‌ గంగూలీ పదవీ కాలాన్ని 10 నెలలకన్నా ఎక్కువ సమయం ఇస్తేనే బాగుంటుందని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. అక్టోబర్‌ 23న బాధ్యతలు చేపట్టనున్న గంగూలీకి తొలుత శుభాకాంక్షలు తెలియజేసి... బిసిసిఐపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి భారత క్రికెట్‌కు అధినేత కావడం సంతోషకరమన్నాడు. గంగూలీ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక అతను బాధ్యతల్లో ఉండే సమయం 10 నెలలు మాత్రమే కావడంతో ఇది చాలా తక్కువ సమయమన్నారు. గంగూలీ బోర్డులో అనేక మార్పులు తీసుకొస్తారనేందుకు బెంగాల్‌ క్రికెట్‌ సంఘంలో ఆయన తీసుకొచ్చిన మార్పులే ఒక ఉదాహరణ అని తెలియజేశాడు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD