గంగూలీ విషయంలో నా అంచనా నిజమైంది..: సెహ్వాగ్

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-29 00:49:33

img

ముంబై: బీసీసీఐకి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎంపిక అవుతారని తాను 2007లోనే అంచనా వేసినట్లు టీం ఇండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. ఈ నెల 23వ తేదీన బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే గంగూలీ ఎప్పటికైన పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రి కూడా అవుతారని తాను అంచనా వేసిన్నట్లు సెహ్వాగ్ పేర్కొన్నారు. ‘‘దాదాపు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడుతున్నారని తెలిసిన వెంటనే 2007లో జరిగిన ఓ ఘటన నాకు గుర్తుకు వచ్చింది. కేప్‌టౌన్‌లో జరుగుతున్న ఓ టెస్ట్ మ్యాచ్‌లో నేను, వసీం జాఫర్ త్వరగా ఔట్ అయ్యాము. టెండూల్కర్ బ్యాటింగ్‌కి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో దాదా బ్యాటింగ్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సిరీస్ మాకు ఎంతో కీలకం.. కానీ గంగూలీ అడిన విధానం సామాన్యమైంది కాదు. అది అతనికి ఒక్కడికే సాధ్యమవుతుంది’’ అని సెహ్వాగ్ తెలిపారు. ‘‘మనలో ఎవరికైన బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే అర్హత ఉందంటే.. అది దాదా ఒక్కడికే అని ఆ రోజు డ్రెస్సింగ్ రూంలో మేమంతా అంగీకరించాము. అతను బెంగాల్‌కి చీఫ్ మినిస్టర్ కూడా అవుతాడని నేను అన్నాను. ఇప్పుడు ఒక భవిష్యవాణి పూర్తైంది. ఇంకొకటి పూర్తి కావాల్సి ఉంది’’ అని సెహ్వాగ్ పేర్కొన్నారు.

అయితే బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం ఎటువంటి ఎన్నికలు జరుగకుండానే గంగూలీ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన రెండో రోజే.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో సమావేశమయ్యారు. భారత క్రికెట్‌ను మరింత అభివృద్ధిలోకి తెచ్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే టీ-20, టెస్ట్ సిరీస్‌ల కోసం జట్లను ప్రకటించారు. అయితే సౌతాఫ్రికాతో ఆడిన జట్టునే టెస్టుల్లో కొనసాగిస్తుండగా.. టీ-20ల్లో విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించి, అతని స్థానంలో రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD