గంభీర్‌పై పాక్ బౌలర్ ఇర్ఫాన్ షాకింగ్ కామెంట్స్

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-07 15:57:43

img

  • గంభీర్ కెరీర్ ముగిసిపోవడానికి కారణం నేనే: పాక్ బౌలర్ వ్యాఖ్య

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కెరీర్ ముగిసిపోవడానికి.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడానికి కారణం తానేనని భావిస్తున్నట్లు పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ చెప్పాడు. ఓ పాకిస్తాన్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ మాట్లాడుతూ.. 2012లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో తన బౌలింగ్‌లో ఆడేందుకు గౌతమ్ గంభీర్ చాలా ఇబ్బంది పడ్డాడని వ్యాఖ్యానించాడు. అప్పుడు జరిగిన టీ20, వన్డే మ్యాచ్‌ల్లో గంభీర్ తన బౌలింగ్‌లో నాలుగు సార్లు ఔట్ అయ్యాడని చెప్పాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో గంభీర్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.

ఈ విధంగా గంభీర్ క్రికెట్ కెరీర్ తన వల్లే ముగిసిపోయిందని తెలిపాడు. తాను టీమిండియాతో జరిగిన 2012 సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు తన బౌలింగ్‌లో ఆడేందుకు చాలా ఇబ్బందిపడ్డారని, తాను హైట్ కావడంతో తాను వేసే బంతులను అర్థం చేసుకోలేక టీమిండియా బ్యాట్స్‌మెన్స్ సతమతమయ్యేవారని చెప్పాడు. మరీ ముఖ్యంగా గంభీర్ అయితే... మ్యాచ్‌లో మాత్రమే కాకుండా ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కూడా గంభీర్ తన కళ్లలో కళ్లు పెట్టి చూసేందుకు భయపడేవాడని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.

ఇర్ఫాన్ ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ... టీమిండియా మేటి ఆటగాళ్ల జాబితాలో గౌతమ్ గంభీర్ చిరస్థానం సంపాదించుకున్నాడు. తన కెరీర్‌లో 147 వన్డే మ్యాచ్‌లు ఆడిన గంభీర్ 5,238 పరుగులు చేశాడు. 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2011లో శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి టీమిండియాను వరల్డ్ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD