గాడిలో పడ్డ వార్నర్

Mana Telangana

Mana Telangana

Author 2019-10-30 03:00:05

img

సిడ్నీ: శ్రీలంకతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. యాషెస్ సిరీస్‌లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన వార్నర్ మళ్లీ ఫామ్‌ను అందుకోవడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిషేధం ముగిసిన తర్వాత సొంత గడ్డపై ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే సెంచరీ సాధించడం వార్నర్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. రానున్న మ్యాచుల్లో కూడా ఇదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో వార్నర్ ఉన్నాడు.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ విజృంభిస్తే కట్టడి చేయడం ఎంత కష్టమో ఇప్పటికే లంక బౌలర్లకు అర్థమైంది. ఇక, బుధవారం జరిగే రెండో టి20లో కూడా మెరుపులు మెరిపించేందుకు వార్నర్ సిద్ధమయ్యాడు. అదే జరిగితే వార్నర్‌ను కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు శక్తికి మించిన పనిగా మారుతుందనే చెప్పాలి. కాగా, తొలి టి20లో వార్నర్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. తాను ఎంత విలువైన ఆటగాడో వార్నర్ మరోసారి నిరూపించాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదే జోరుతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

బంగ్లాదేశ్‌తో రాజధానిలో ఢిల్లీలో జరిగే ట్వంటీ20 మ్యాచ్ సాఫీగా సాగుతుందనే నమ్మకాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వ్యక్తం చేశారు. మ్యాచ్ ప్రారంభం నాటికి అన్ని సమస్యలు తొలగి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న వాతావరణ కాలుష్యం నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సిఎం స్పందించారు. మ్యాచ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉందని, అప్పటికి స్థితి మాములుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

David Warner clouts T20 century in massive total

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD