గుంటూరు, కర్నూలు మ్యాచ్‌ డ్రా

Prajasakti

Prajasakti

Author 2019-10-13 04:54:28

img

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌
గుంటూరు, కర్నూలు జట్ల మధ్య జరిగిన మూడు రోజుల మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సిఎస్‌ఆర్‌ శర్మ కళాశాల క్రీడామైదానంలో అండర్‌-14 గ్రూపు బి మ్యాచ్‌లలో భాగంగా కర్నూలు, గుంటూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవర్‌ నైట్‌ స్కోరు 153/5తో ఆట ప్రారంభించిన గుంటూరు జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసి డిక్లేర్డ్‌ చేసింది. ఈ జట్టులో కెఎల్‌ శ్రీనివాస్‌ 160(279 బంతుల్లో; 26 ఫోర్లు) అద్భుత సెంచరీతో నాటౌట్‌గా నిలిచారు. కర్నూలు బౌలర్‌లలో ధనుష్‌ నాయుడు 3 వికెట్లు, డి.అక్షిత్‌ రెడ్డి, సిహెచ్‌ శివసాయి ధీరజ్‌ చెరో రెండు వికెట్లతో రాణించారు. 272 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కర్నూలు జట్టు 9 వికెట్లు నష్టపోయి 188 పరుగులు సాధించింది. ఈ జట్టులో వై.యగేశ్వర్‌ 100(82 బంతుల్లో; 17 ఫోర్లు) స్కోరు చేసి జట్టును ఆదుకున్నాడు. డి.అక్షిత్‌ రెడ్డి 26 పరుగులు చేశాడు. గుంటూరు బౌలర్‌లలో కె.ముఖేష్‌ 50 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు సాధించాడు. మ్యాచ్‌ ముగింపు ఓవర్లల్లో చివరి వికెట్‌ తీయటంలో గుంటూరు బౌలర్లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కర్నూలు జట్టుకి 3 పాయింట్లు, గుంటూరు జట్టుకి 1 పాయింట్‌ దక్కాయి. మ్యాచ్‌ను క్రికెట్‌ ప్రకాశం కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN