గులాబీ బంతితో డే-నైట్‌ .. మ్యాచ్ ..

Navyamedia

Navyamedia

Author 2019-10-29 09:39:07

img

బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు(బిసిబి) డే-నైట్‌ టెస్ట్‌ ఆడేందుకు ) అంగీకరించడంతో నవంబర్‌ 22-26వరకు టీమిండియా తొలి డే-నైట్‌ టెస్ట్‌కు దారిసుగమం అయ్యింది. దీనితో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక జరిగే రెండోటెస్ట్‌ గులాబీ బంతితో డే-నైట్‌లో జరగనుంది. డే-నైట్‌ టెస్ట్‌ గురించి గంగూలీ బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డుకు ప్రతిపాదించిన కొద్ది సమయంలోనే చారిత్రక టెస్ట్‌కు మార్గం సుగమం కావడం గమనార్హం. తొలుత బంగ్లా క్రికెటర్లు గులాబీ బంతి మ్యాచ్‌ను వ్యతిరేకించినా బిసిబి వారితో నాలుగైదుసార్లు సమావేశమై ఒప్పించింది. ఇదొక శుభ పరిణామం… టెస్ట్‌ క్రికెట్‌కు ఈ చర్యలు అవసరం. నేను, నా జట్టు దీనికి కట్టుబడి ఉన్నాం. విరాట్‌కు కృతజ్ఞతలు. అతడు డే-నైట్‌ టెస్ట్‌కు అంగీకరించాడు అని గంగూలీ మీడియాకు తెలిపారు.

ఈ డే-నైట్‌ టెస్ట్‌ జరిగే ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో క్రీడా దిగ్గజాలు అభినవ్‌ బింద్రా, మేరీకోమ్‌, పివి సింధులకు సన్మానం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్షిక గులాబీ టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ తరహాలోనే ఈడెన్‌ గార్డెన్‌లోనూ టీమిండియా గులాబీ బంతితో వార్షిక టెస్ట్‌ ఆడనుంది. దులీప్‌ ట్రోఫీలో గులాబీ బంతితో ఆడిన క్రికెటర్లు బంతి పాతబడిన తర్వాత సరిగ్గా కనిపించడం లేదని అప్పట్లో బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పుడూ వాడే ఎస్‌జి టెస్ట్‌ క్రికెట్‌ బంతులను కాకుండా కుకాబుర్రా, డ్యూక్స్‌ బంతులను వినియోగించే అవకాశముంది.



READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN