గెలుపు బాటపట్టిన హామిల్టన్‌

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-30 05:44:00

img
సోచి (రష్యా): బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఎట్టకేలకు గెలుపు బాట పట్టాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రిలో అగ్రస్థానంలో నిలిచిన ఈ మెర్సిడెజ్‌ డ్రైవర్‌ ఈ ఏడాది ఆగస్టు 4 (హంగేరియన్‌ గ్రాండ్‌ ప్రి) తర్వాత తొలి విజయాన్ని నమోదుచేశాడు. తన జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్‌ను అధిగమించి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది 16 రేసుల్లో పాల్గొన్న హామిల్టన్‌ తొమ్మిదింట విజేతగా నిలిచాడు. మొత్తంగా అతడి కెరీర్‌లో ఇది 82వ విజయం. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ ఏడాది 73 పాయింట్లతో అతడే టాప్‌లో ఉన్నాడు. పోల్‌ స్థానం నుంచి రేస్‌ను ప్రారంభించిన ఫెరారీ రేసర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ మూడో స్థానంలో నిలిచాడు. తొలి ల్యాప్‌లో లెక్‌లెర్క్‌ను అధిగమించిన ఫెరారీ రేసర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ తన జట్టు ఆదేశాలను విస్మరించాడు. టెక్నికల్‌ ఫెయిల్యూర్‌కి ముందే లెక్‌ను దాటనివ్వాలన్న సూచనలను పాటించలేదు. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ నాలుగో స్థానంలో నిలిచాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD