ఘనంగా ఐఎస్‌హెచ్‌ అవార్డుల వేడుక

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-28 05:40:46

img

ముంబై: ఫుల్వామా ఉగ్రదాడి కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ స్పోర్టింగ్‌ ఆనర్‌ (ఐఎ్‌సహెచ్‌) అవార్డుల కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. 17 క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులను ప్రదానం చేశారు. ఆర్‌పీ-ఎ్‌సజీ గ్రూప్‌ చైర్మన్‌ సంజీవ్‌ గోయెంకా, విరాట్‌ కోహ్లీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి లెజెండరీ అథ్లెట్‌ మిల్కా సింగ్‌, కోహ్లీ, అతని భార్య అనుష్క, యువరాజ్‌ సింగ్‌ దంపతులు, క్రీడాకారిణులు సానియా మీర్జా, దీపా కర్మాకర్‌, వినేశ్‌ ఫొగట్‌, మనూ భాకర్‌, స్మృతి మంథాన, జెమీమా రోడ్రిగ్స్‌, అజింక్యా రహానె, మహేశ్‌ భూపతి, బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా గత ఫిబ్రవరిలోనే ఈ అవార్డులను ప్రదానం చేయాలనుకున్నా.. ఫుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి కారణంగా వాయిదా పడింది. 11 కేటగిరీల్లో అవార్డులను ఐఎస్‌హెచ్‌ జ్యూరీ నిర్ణయించగా.. ఆరు పాపులర్‌ ఛాయిస్‌ అవార్డులకు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా ఎంపిక చేశారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN