చత్తీస్ గఢ్ సంచలనం
- ముంబైపై విజయం
- విజయ్ హజారే
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి షాక్ తగిలింది. శనివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో ముంబైని ఐదు వికెట్లతో ఓడించి చత్తీ్సఘడ్ సంచలనం సృష్టించింది. ముందుగా ముంబై 50 ఓవర్లలో 7వికెట్లకు 311 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆదిత్య తారె (90), సూర్యకుమార్ యాదవ్ (81), శ్రేయాస్ అయ్యర్ (50) అర్ధసెంచరీలు సాధించారు. ఆతర్వాత అమన్దీ్ప ఖరే (117 నాటౌట్) అజేయ శతకంతో చత్తీ్సగఢ్ మరో బంతి మిగిలుండగానే 49.5 ఓవర్లలో 318/5 స్కోరుతో గెలిచింది.