చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్

Mana Telangana

Mana Telangana

Author 2019-10-17 15:37:31

img

బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ముంబై యువ సంచలనం యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. బుధవారం ఆలూర్ మైదానంలో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ (203) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలో లీ ఏ క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. యశస్వి 17 ఏళ్ల వయసులోనే వన్డేల్లో డబుల్ సెంచరీ చేసి చరిత్ర తిరగ రాశాడు. విజయ్ హజారే టోర్నమెంట్‌లో యశస్వి ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలతో సత్తా చాటాడు. తాజాగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన డబుల్ సెంచరీ సాధించాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన జైస్వాల్ 154 బంతుల్లోనే 12 భారీ సిక్సర్లు, మరో 17 బౌండరీలతో 203 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ ఆదిత్య తారే (78) అండగా నిలిచాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన యశస్వి పరుగుల వరద పారించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. ఇదే క్రమంలో కెప్టెన్ తారేతో కలిసి తొలి వికెట్‌కు 200 పరుగులు జోడించాడు. అంతేగాక సిద్ధేశ్ లడ్ (32)తో కలిసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. యశస్వి వీరవిహారం చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ 319 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ముంబై 39 పరుగులతో ఘన విజయం సాధించింది. కాగా, విరాట్ సింగ్ (100) సెంచరీ సాధించినా జార్ఖండ్‌ను గెలిపించలేక పోయాడు.

Yashasvi Jaiswal world record with double hundred

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD