చితక్కొట్టిన మయాంక్‌ అగర్వాల్‌ : డబుల్‌ సెంచరీ

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-03 17:36:51

img

దక్షిణాఫ్రికా జట్టుతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆటలో రెండో రోజైన ఈరోజు వ్యక్తిగత స్కోరు 84తో ఇన్నింగ్స్ కొనసాగించిన మయాంక్ ఈరోజు 371 బంతుల్లో 215 (23x4, 6x6) ద్విశతకం బాదేశాడు. కెరీర్‌లో ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతున్న మయాంక్ ఈరోజు తొలి సెషన్‌లో సెంచరీ మార్క్‌ని అందుకుని రెండో సెషన్‌లో డబుల్ సెంచరీ మైలురాయిని చేరకోవడం విశేషం. టెస్టుల్లో మయాంక్‌ అగర్వాల్‌‌కి ఇదే తొలి ద్విశతకం.

టెస్ట్ క్రికెట్‌ అంటే సుదీర్ఘంగా ఆడటమే కాక అవసరమైతే బౌండరీల మోత మోగించడంలోనూ ఏమాత్రం వెనక్కి తగ్గది లేదని నిరూపించిన మయాంక్‌ డబుల్‌ సెంచరీ కొట్టేశాడు. సెంచరీ సాధించడానికి 203 బంతులు ఎదుర్కొంటే దాన్ని డబుల్‌ సెంచరీగా మలుచుకోవడానికి మరో 155 బంతులు వాడి ఓవరాల్‌గా 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ద్విశతకం నమోదు చేశాడు. మరోపక్క ఇప్పటికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 431 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ రెండు, ఫిలాండర్, ముత్తుస్వామి చెరో వికెట్ దక్కించుకున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN