చిన్న శేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామి

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-01 16:10:46

img

తిరుమల:శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై న‌వ‌నీతకృష్ణ అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నెమ‌లి పింఛం, పిల్ల‌న‌గ్రోవి, న‌వ‌నీతంతో ఉన్న కృష్ణుడి రూపం భ‌క్తుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసింది. వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.సాయంత్రం 6 నుంచి 7 గంటల వకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మ‌న్ పృథ్విరాజ్, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు పాల్గొన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN