చివరి వన్డేలో అద్భుత విజయం
వడోదర: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం ఇక్కడి రిలయన్స్ క్రికెట్ గౌండ్‌లో జరిగిన చివరి వన్డేలో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి 30 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో 147 పరుగుల లక్షాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు చివర్లో పరుగుల వేటలో విఫలం కావడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒక దశలో మారిజన్నే కప్, సునె లుస్లో క్రీజ్‌లో ఉన్నంత సేపు దక్షిణాఫ్రికా సునాయాసంగా విజయం సాధిస్తుం దనిపించింది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 40 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే 24 పరుగులు చేసి న లుస్ను ఎడం చేతి వాటం స్పిన్నర్ ఏక్తా బిస్త్ ఔట్ చేయడంతో ఆ జట్టు విజయావ కాశాలకు భారీ దెబ్బ తగిలింది. ఆవెనువెం టనే మారిజన్నే (29) వికెట్‌ను దీప్తి శర్మ పడగొట్టింది. ఆ తర్వాత వచ్చిన షబ్నిమ్ ఇస్మాయిల్, నోడుమిసో షంగసేలు విజ యం కోసం కొద్ది సేపు పోరాటం సాగించా రు కానీ ఫలితం లేకపోయింది.
వీరిద్దరూ కూడా పెవిలియన్ చేరడంతో విజయానికి అవసరమైన తొమ్మిది పరుగులు చేసే బాధ్య త చివరి జంట అయిన టుమి సేఖుఖునే, అయబొంగా ఖాకాలపై పడింది. అయితే భారత కెప్టెన్ మిథాలి రాజ్ అనూహ్యంగా పార్ట్ టైమ్ బౌలర్ జెమిమా రోడ్రిగ్స్‌ను బరిలోకి దింపగా ఆమె సేఖుఖు నేను ఔట్ చేసి మరో రెండు ఓవర్లు ఉండగానే జట్టుకు అద్భుత విజయా న్ని అందించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. హర్మన్ ప్రీత్, శిఖాపాం డేలు ఏడో వికెట్‌కు 49 పరుగులు జోడించడంతో భారత్ కాస్త గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే 46 ఓవర్లలోపే భారత్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మారిజన్నే కేవలం 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది.