చెలరేగిన పూనమ్ రౌత్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-05 04:53:00

img

నార్త్‌సాండ్: గత మ్యాచ్‌లో విజయం అంచుల వరకు వచ్చి ఒక్క పరుగు తేడాతో ఓడిన భారత మహిళల జట్టు.. ఈసారి పూర్తి ఆధిపత్యంతో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం రాత్రి ఇక్కడ జరిగిన రెండో వన్డేలో మిథాలీ రాజ్ సేన 53 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను టీమ్‌ఇండియా 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. పూనమ్ రౌత్ (77), కెప్టెన్ మిథాలీ రాజ్ (40), వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (46) రాణించడంతో 50 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత స్పిన్ త్రయం దీప్తి శర్మ (2/25), పూనమ్ యాదవ్ (2/26) రాజేశ్వరి గైక్వాడ్ (2/27) ధాటికి విండీస్ 47.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. షిమైన్ క్యాంప్‌బెల్ (39) టాప్‌స్కోరర్. పూనమ్ రౌత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే బుధవారం ఇక్కడే జరుగనుంది.

సంక్షిప్త స్కోర్లు
భారత్: 191/6 (పూనమ్ 77, హర్మన్‌ప్రీత్ 46; ఫ్లెచర్ 2/32), వెస్టిండీస్: 138 ఆలౌట్ (షిమైన్ క్యాంప్‌బెల్ 39; దీప్తి 2/25, పూనమ్ 2/26).
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN