జట్టును అభినందించిన భారత లెజెండ్‌….

Amaravatinews

Amaravatinews

Author 2019-10-14 17:54:14

img

Share this on WhatsApp

ఇంటర్నెట్‌డెస్క్‌:టీమిండియా లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ భారత జట్టును అభినందించాడు. దక్షిణాఫ్రికాపై ఆదివారం 2-0తో టెస్టు సిరీస్‌ విజయంతో టీమిండియా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్‌లు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించడానికి టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని మాస్టర్‌ బ్లాస్టర్‌ ట్వీట్‌ చేశారు. పూణె టెస్టులో కెప్టెన్‌ కోహ్లీ(254*) తొలుత వీరోచితంగా ఆడి కెరీర్‌లోనే అత్యధిక స్కోర్‌ సాధించగా టీమిండియా 601/5తో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 275 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఆదివారం ఉదయం భారత కెప్టెన్‌ పర్యాటక జట్టును ఫాల్‌ఆన్‌కు ఆహ్వానించాడు. టీమిండియా బౌలర్లు మళ్లీ విజృంభించడంతో డుప్లెసిస్‌ సేన 189 పరుగులకే కుప్పకూలి సిరీస్‌ను చేజార్చుకుంది. టీమిండియా కెప్టెన్‌ ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ధోనీ తర్వాత జట్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ 2015 నుంచి స్వదేశంలో జరిగిన ప్రతి టెస్టు సిరీస్‌ను గెలిపించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN