జయసూర్య శ్రమ వృధా.. రెండో వన్డేలో పాకిస్థాన్ విజయం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-01 02:16:05

img

కరాచీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. బాబర్ ఆజామ్ సెంచరీతో 305 పరుగులు చేసింది. అయితే 306 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక టాప్ ఆర్డర్ బోల్తా పడింది. పాకిస్థాన్ బౌలర్లు రాణించడంతో శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు స్వల్పస్కోర్‌కే పెవిలియన్ చేరారు. గుణతిలక(14), సమరవిక్రమ(6), అవిష్క(0), ఒషాడా(1), లహిరు తిరిమన్నే(0) ఒకరి తర్వాత మరొకరు డ్రెస్సింగ్ రూం బాటపట్టారు. ఈ దశలో షెహన్ జయసూర్య, దాసున్ శనక జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కి 177 పరుగులు జోడించారు. అయితే 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జయసూర్య పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొంత సమయానికి శనక(68) ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు పాక్ బౌలర్ల ధాటిని తట్టుకోలేకపోయారు. దీంతో శ్రీలంక 46.5 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌట్ కావడంతో పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ బౌలింగ్‌లో ఉస్మాన్ షిన్వారీ 5, షాదాబ్ ఖాన్ 2, మహ్మద్ అమీర్, ఇమాద్ వాసిమ్, వహాబ్ రియాజ్ తలో వికెట్ తీశారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN