జింబాబ్వేపై నిషేధం ఎత్తివేత

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-15 07:53:00

-సూపర్ ఓవర్ నిబంధనల్లో మార్పు.. ఐసీసీ కీలక నిర్ణయాలు
దుబాయ్ : జింబాబ్వే, నేపాల్ క్రికెట్ బోర్డులపై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎత్తేసింది. మళ్లీ ఆ దేశాలను సభ్యులుగా గుర్తిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. జింబాబ్వే బోర్డు అధికారులు, క్రీడా మంత్రులతో చర్చించాక ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం చేసుకుంటున్నదన్న కారణంతో జింబాబ్వేపై ఐసీసీ ఈ ఏడాది జులైలో నిషేధం విధించగా... నిబంధనలకు విరుద్ధంగా బోర్డు ఎన్నికల్లో అక్కడి ప్రభుత్వం కలుగజేసుకుందని నేపాల్‌ను 2016లోనే ఐసీసీ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 ప్రపంచకప్‌లో జింబాబ్వే పాల్గొననుంది.
imgఐసీసీ మహిళల క్రికెట్ టోర్నీల ప్రైజ్‌మనీని భారీగా పెంచుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 2018తో పోలిస్తే 2020 టీ20 ప్రపంచకప్ నగదు ప్రోత్సాహాన్ని ఐదు రెట్లు పెంచింది. టీ20ప్రపంచకప్ విజేతకు దాదాపు రూ. 7.12కోట్లు ఇవ్వనుండగా, రన్నరప్‌కు దాదాపు రూ.3.56కోట్లు దక్కనున్నాయి. ఇక 2021 వన్డే ప్రపంచకప్ కోసం మొత్తం 24కోట్ల కేటాయించనుంది. అలాగే తొలిసారిగా అండర్-19 మహిళల ప్రపంచకప్‌ను 2021 నుంచి ప్రతి రెండ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించింది.

ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్లు

ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో తీవ్ర వివాదాస్పదమైన సూపర్ నిబంధనలను ఐసీసీ సవరించింది. అన్ని ముఖ్యమైన టోర్నీల్లో.. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్లు ఉంటాయని ప్రకటించింది. ప్రపంచకప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేస్తే... ఆ తర్వాత ఇంగ్లండ్ కూడా అన్నే పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లోనూ రెండు జట్లు 15పరుగులే చేశాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN