జిల్లా ఫుట్‌బాల్‌ బాలబాలికల జట్లు ఎంపిక

Prajasakti

Prajasakti

Author 2019-10-22 01:08:04

img

చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లలో పలువురు క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. అండర్‌ 14 విభాగంలో బాలబాలికలకు పలు ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా జట్టు ఎంపిక చేశారు. బాలుర జట్టులో 18 మందిని, బాలికల జట్టులో 18 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిడిఒ రాధమ్మ మాట్లాడుతూ క్రీడల మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని రెండింటిని సమానంగా స్వీకరించిన నాడే మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందుతారన్నారు. అనంతరం మాజీ ఎంపిటిసి సభ్యులు సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ క్రీడాకారులు విజయమే స్ఫూర్తిగా తీసుకెళ్లాలని వచ్చేనెల కడపలో జరుగు టోర్నమెంట్‌లో విజేతగా తిరిగి రావాలని కోరారు. జిల్లా టీంలకు సెలక్ట్‌ కానీ విద్యార్థులు నిరాశ చెందకుండా ఇంకా కష్టపడి జట్టులో స్థానం కోసం పలు క్రీడలు ఆడాలన్నారు. శ్రమతో కూడిన ప్రాక్టీస్‌ చేసి క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించాలని కోరారు. జిల్లా జట్టుకు ఎంపికైన 36 మంది క్రీడాకారులను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ లలిత కుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌ రాజు, ఫుట్‌బాల్‌ స్కూల్‌ గేమ్‌ కార్యదర్శి మల్‌ రెడ్డి, పీఈటీలు నిరంజన్‌, బాబు, ప్రభాకర్‌, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD