టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

Prajasakti

Prajasakti

Author 2019-11-10 21:55:03

img

నాగ్‌పూర్‌ : మూడు టీ20ల సిరీస్ లో చివరిదైన మూడో మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. నాగ్‌పూర్‌లోని విద‌ర్భ క్రికెట్ అసోసియేష‌న్‌ వేదికగా ఇవాళ‌ జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. బ్యా‌టింగ్ ప్రారంభంలోనే రోహిత్ శ‌ర్మ (2) ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. మూడు ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి భార‌త్ 13 ప‌రుగుల వ‌ద్ద బ్యాటింగ్ చేస్తోంది. క్రీజులో ధావ‌న్‌, కెఎల్ రాహుల్ ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ కోసం భారత్ హార్డ్ హిట్టర్ శివం దూబేను తుది జట్టులోకి తీసుకుంది. దాంతో అందరి కళ్లు ఈ యువ బ్యాట్స్ మన్ పైనే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. దేశవాళీ పోటీల్లో సిక్సర్ల వీరుడిగా దూబేకు మంచి గుర్తింపు ఉంది. మరి అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణిస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది.

కాగా, ఈ మూడు టి20ల సిరీస్ లో టీమిండియా, బంగ్లాదేశ్ చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ మూడో టి20లో విజేతగా నిలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. ప్ర‌

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN