టీం ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు : గంగూలీ
ముంబయి: భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ అన్నారు. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లి కెప్టెన్సీ అద్భుతంగా ఉందని గంగూలీ అభిప్రాయపడ్డారు. కోహ్లి జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాడని ఆయన పేర్కొన్నారు. కోహ్లి కెప్టెన్సీలో భారత్ అనేక విజయాలు నమోదు చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వదేశంలో భారత్ వరుసగా 11 టెస్టు సరీస్లు గెలిచి, ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును చెరిపేశారు. విదేశాల్లో సైతం విజయాల శాతం చాలా మెరుగు పడిందని గంగూలీ తెలిపారు. కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా సైతం అతను అద్భుత ఫామ్లో ఉన్నాడు. కోహ్లినే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా కొనసాగుతాడని గంగూలీ ఈ సందర్భంగా తెలిపారు.
