టీమిండియా ఆడనంటే ఆసియా కప్ అట్టర్ ప్లాపే...: పాకిస్థాన్

Asianet News

Asianet News

Author 2019-09-30 21:46:48

img

వచ్చే ఏడాది ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యనివ్వనున్న విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే పాక్ లో పర్యటించేందుకు సిద్దంగా లేరు. దీంతో అక్కడ ఈ టోర్నీ జరుగుతుందా అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ భారత జట్టు పాకిస్థాన్ లో పర్యటించేందుకు అంగీకరిస్తే మిగతా జట్లు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. అందుకోసం టీమిండియాను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది పిసిబి.

తాజాగా ఆసియా కప్ టోర్నమెంట్ పై పిసిబి సీఈవో వసీం ఖాన్ మాట్లాడారు. టీమిండియా ఈ టోర్నీలో పాల్గొంటోనే విజయవంతం అంవుతుందని... ఏదైనా కారణాలతో ఆ జట్టు పాల్గొనకుంటే మాత్రం అట్టర్ ప్లాప్ అవుతుందన్నారు. ఆటగాళ్ళ భద్రత విషయంలో బిసిసిఐకి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని...వారు ఎలా కోరుకుంటే అలాంటి భద్రతను ఏర్పాటు చేయడానికి సిద్దమన్నారు. అయితే తమ నిర్ణయాన్ని వచ్చే ఏడాది జూన్ లోపే తెలియజేస్తే బావుంటుందని వసీం అన్నారు.

భారత్ లో ఐసిసి ఎలాంటి టోర్నమెంట్లు నిర్వహించినా తాము రావడానికి సిద్దమేనని అన్నాడు. భారత్ తో ద్వైపాక్షిక సీరిస్ లు ఆడేందుకు కూడా మేం సిద్దంగానే వున్నామని...బిసిసిఐ నుండే పాజిటివ్ నిర్ణయం రావాల్సి వుందన్నారు. బిసిసిఐని ఒప్పించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతూనే వుంటాయని వసీం స్పష్టం చేశారు.

ఇటీవలే శ్రీలంక ఆటగాళ్లు కొందరు పాక్ లో పర్యటించేందుకు విముఖత ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ భద్రతపై మరోసారి చర్చ మొదలయ్యింది. అయితే ప్రస్తుతం శ్రీలంక జూనియర్ టీం అక్కడ పర్యటిస్తోంది. దీన్ని బట్టే పాకిస్థాన్ లో భద్రతపై ఐసిసి కూడా ఓ అంచనాకు వచ్చే అవకాశముంది. ఒకవేళ ఏదైనా గందరగోళం చోటుచేసుకుంటే మాత్రం ఆసియా కప్ ఇతర దేశాలకు తరలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN