టీ-20ల్లో 100 మ్యాచ్ ల రోహిత్ శర్మ

Teluguglobal

Teluguglobal

Author 2019-11-07 13:57:53

img

  • రాజ్ కోట మ్యాచ్ తో సరికొత్త రికార్డు

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్ ఘనతను డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సొంతం చేసుకోనున్నాడు.

రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్…రోహిత్ శర్మ వందో టీ-20 పోరు కానుంది.

ధోనీ రికార్డును అధిగమించి…

img

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన తొలి మ్యాచ్ ద్వారా..అత్యధిక టీ-20మ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్ గా రోహిత్ నిలవటమేకాదు.. మాజీ కె్ప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో ఉన్న 98 మ్యాచ్ ల రికార్డును సైతం అధిగమించాడు.

పుష్కరకాలంలో 100 మ్యాచ్ లు…

img

2007లో డర్బన్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ ద్వారా టీ-20 అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ..గత 12 సంవత్సరాల కాలంలో..ప్రస్తుత బంగ్లా సిరీస్ లోని ఢిల్లీ పోటీ వరకూ 99 మ్యాచ్ లు ఆడి నాలుగు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో సహా 2వేల 452 పరుగులు సాధించాడు.32.14 సగటు నమోదు చేశాడు.

అత్యధిక పరుగుల రోహిత్…

img

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న 2 వేల 450 పరుగుల రికార్డును ఢిల్లీ మ్యాచ్ లోనే రోహిత్ శర్మ తెరమరుగు చేశాడు.
విరాట్ కేవలం 72 మ్యాచ్ ల్లోనే 2 వేల 450 పరుగులు సాధిస్తే…రోహిత్ శర్మ 99 మ్యాచ్ ల్లో 2452 పరుగులు సాధించగలిగాడు.

img

రోహిత్, ధోనీల తర్వాత అత్యధిక టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్ల వరుసలో సురేశ్ రైనా (78), విరాట్ కొహ్లీ ( 72), యువరాజ్ సింగ్ ( 58 ), శిఖర్ ధావన్ ( 55 ) ఉన్నారు.

వంద టీ-20 మ్యాచ్ ల ఘనులు…

img

టీ-20 క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 111 మ్యాచ్ లు ఆడిన ఘనత పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరుతో ఉంది.
వంద టీ-20మ్యాచ్ లు ఆడిన అతికొద్ది మంది క్రికెటర్లలో రోహిత్ శర్మ సైతం చోటు సంపాదించగలిగాడు.

img

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD