టీ-20 చరిత్రలో నేడు 1000వ మ్యాచ్

Teluguglobal

Teluguglobal

Author 2019-11-03 11:20:38

img

  • కోట్లా… ఆటలో భారత్ కు బంగ్లాదేశ్ సవాల్

టీ-20 ఫార్మాట్లో 5వ ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీ వేదికగా జరిగే తొలి టీ-20మ్యాచ్…ప్రారంభానికి ముందే పలువిధాలుగా రికార్డుల్లో చేరింది.

img

ధూమ్ ధామ్ టీ-20 చరిత్రలో 1000వ మ్యాచ్ గా నమోదుకానుంది. అంతేకాదు…వాయుకాలుష్య వాతావరణంలో జరుగుతున్న తొలి టీ-20 మ్యాచ్ గా కూడా చరిత్రలో నిలిచిపోనుంది.

img

టీ-20 ఫార్మాట్లో ఇప్పటి వరకూ భారత్ తో ఎనిమిదిసార్లు మాత్రమే తలపడిన బంగ్లాదేశ్…ఎనిమిదికి ఎనిమిదిసార్లూ పరాజయాలు పొందటం విశేషం.

img

ముంబై యువఆల్ రౌండర్ శివం దూబే..టీ-20 ల్లో భారత జట్టు సభ్యుడుగా అరంగేట్రం చేయడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.

img

న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియాన్ని …కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే కావటం మరో విశేషం.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN