టీ20 దెబ్బకు వన్డేలు విలవిల!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-22 05:02:21

img

అత్యధికులు వీక్షించిన టోర్నీగా ఇటీవలి వన్డే వరల్డ్‌కప్‌ రికార్డు నెలకొల్పిందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించింది. కానీ టీ20ల హవాలో వన్డేలు ప్రాధాన్యం కోల్పోతున్నాయి. అవును..ఐసీసీ భవిష్య పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) చూస్తే ఇది స్పష్టమవుతోంది. 2022 వరకు ప్రకటించిన ఐసీసీ ఎఫ్‌టీపీని పరిశీలిస్తే..ఏ ద్వైపాక్షిక సిరీ్‌సలలోనూ మూడువన్డేలకు మించి లేకపోవడం గమనార్హం. అదే సమయంలో ఆ సిరీస్‌ లలో టీ20లు ఎక్కువగా ఉండడం విశేషం. అంతేకాదు..రాబోయే మూడేళ్లలో కొన్ని సిరీ్‌సలలో నైతే అసలు వన్డేల ప్రసక్తే లేకపోవడం ఈ మ్యాచ్‌లపట్ల అభిమానులకు ఆసక్తి తగ్గిపోతోందని అర్థమవుతోంది. మరోవైపు కొన్ని సిరీ్‌సలలో ఏకంగా ఐదు టీ20లు ఉండడం ఈ మ్యాచ్‌ల క్రేజ్‌ తెలియజేస్తోంది. ‘ద్వైపాక్షిక సిరీ్‌సల నిర్వహణ రెండు దేశాల క్రికెట్‌ బోర్డులపై ఆధారపడి ఉంటుంది.

ఆ సిరీ్‌సలలో తక్కువ వన్డేలు ఉండాలని ఐసీసీ ఎప్పుడూ సూచించదు. అయితే టీ20లను ప్రోత్సహించాలని చర్చలయితే జరుగుతున్నాయి’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ‘చాంపియన్‌షి్‌ప’ ద్వారా టెస్ట్‌ క్రికెట్‌కు పూర్వ వైభవం తేవడం, టీ20ల ద్వారా క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తం చేయడం ప్రస్తుతం ఐసీసీ లక్ష్యమని ఆ వర్గాలు తెలిపాయి. 2021 చాంపియన్స్‌ ట్రోఫీకి ఐసీసీ స్వస్తి చెప్పింది. దానికి బదులుగా 2021లో భారత్‌లో టీ20 ప్రపంచ కప్‌ నిర్వహించాలని తలపెట్టింది. అంటే.. 2020లో ఆస్ట్రేలియాలో జరిగే పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ముగిసిన ఏడాదికే మరో ప్రపంచకప్‌నకు రూపకల్పన చేసింది. ఇవన్నీ కూడా.. పొట్టి క్రికెట్‌కు ఐసీసీ ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నదో తెలియచెబుతున్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD