టీ20 ప్రపంచకప్‌కు పవువా న్యూగినియా, ఐర్లాండ్‌ అర్హత

Prajasakti

Prajasakti

Author 2019-10-29 04:12:40

img

దుబాయి : పపువా న్యూగినియా, ఐర్లాండ్‌ జట్లు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. పపువా న్యూగినియా(పిఎన్‌జి) ఆదివారం కెన్యాపై 45 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నీకి అర్హత సాధించింది. పపువా 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడ్డ దశలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నార్మన్‌ వనువా(54) గట్టెక్కించాడు. దాంతో పవువా 19.3 ఓవర్లలో 113 పరుగులు చేయగల్గింది. ఆపై 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కెన్యా 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలడంతో పపువా చిరస్మరణీయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పపువా న్యూగినియా రన్‌రేట్‌ ప్రాతిపదికపై అగ్రస్థానంలో నిలిచి టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించగల్గింది. శనివారం ఐర్లాండ్‌ జట్టు నైజీరియాపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి అంతకుముందే ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యింది. ఓమన్‌-జెర్సీ జట్ల మధ్య మ్యాచ్‌లో ఓమన్‌ గెలిస్తే ఐర్లాండ్‌ ఇంటికెళ్లేది. కానీ జెర్సీ జట్టు 14 పరుగుల తేడాతో ఓమన్‌ను ఓడించడంతో ఐర్లాండ్‌కు జాక్‌పాట్‌ తగిలింది. ఈ రెండుజట్లు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD