టీ20 ప్రపంచకప్‌లో కొత్త జట్టుకు చోటు…

Mana Telangana

Mana Telangana

Author 2019-10-29 16:55:49

img

దుబాయి: వచ్చే యేడాది ఆస్ట్రేలియాలో జరిగే ట్వంటీ20 ప్రపంచకప్‌కు పవువా న్యూ గునియా (పిఎన్‌జి) జట్టు అర్హత సాధించింది. అంతకుముందు ఐర్లాండ్ కూడా టి20 వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్‌లో రెండు కొత్త జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. కాగా, కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన పిఎన్‌జి జట్టు వరల్డ్‌కప్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. అనూహ్య మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో పిఎన్‌జి అసాధారణ పొరాట పటిమతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పిఎన్‌జి 118 పరుగులు సాధించింది.

ఒక దశలో 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న పిఎన్‌జిను కెప్టెన్ నార్మన్ ఆదుకున్నాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన నార్మన్ జట్టుకు గౌరవప్రద స్కోరును అందించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన నార్మన్ 54 పరుగులు సాధించాడు. అతని అసాధారణ బ్యాటింగ్‌తో పపువా న్యూ గునియా జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత ఊరిస్తున్న లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కెన్యా 18.4 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. కెన్యాను పిఎన్‌జి బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేసి తమ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు. అంతేగాక ఈ విజయంతో పపువా న్యూ గునియా జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. కాగా, ఐర్లాండ్ కూడా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. స్టాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు కూడా రేసులో నిలిచినా మెరుగైన రన్‌రేట్ వల్ల ఐర్లాండ్‌కు వరల్డ్‌కప్ బెర్త్ సొంతమైంది.

PNG make History, Qualified for T20 World Cup 2020

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN