టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీల ఆవిష్కరణ నేడు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-01 06:29:37

మెల్‌బోర్న్‌: వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే పురుషులు, మహిళల టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీలను శుక్రవారం ఆవిష్కరించనున్నారు. మెల్‌బోర్న్‌లో జరిగే ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ పాల్గొననుంది. ‘మా మామయ్య మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ గొప్ప క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నేను టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీలను ఆవిష్కరించబోతుండడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అలాగే ఆయా దేశాల జట్ల తరఫున ఆడుతున్న మహిళా క్రికెటర్లు తమ కలను నెరవేర్చుకున్నందుకు అభినందనలు తెలుపుతున్నాను. అంతర్జాతీయ వేదికపై వారు మరింత రాణించాలి’ అని కరీనా తెలిపింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD