టీ20 ప్రపంచకప్.. అర్హత సాధించిన రెండు కొత్త జట్లు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-28 23:52:50

img

దుబాయ్: 2020లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రెండు కొత్త జట్లు అర్హత సాధించాయి. వచ్చే ఏడాది అక్టోబరు 18 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. నవంబరు 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరగనుంది. కాగా, ఈ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు రెండు కొత్త జట్లు ఐర్లండ్, పపువా న్యూగినియాలు అర్హత సాధించాయి. ఐర్లండ్ ఇప్పటికే ప్రపంచకప్‌కు అర్హత సాధించగా, కెన్యాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూగినియా 45 పరుగులు తేడాతో విజయం సాధించింది.

స్కాట్లాండ్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఓటమి పాలవడంతో నెట్ రన్‌రేట్ ఆధారంగా పపువా న్యూగినియా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. మరో నాలుగు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. కాగా, ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర మొత్తం 16 జట్లు తలపడనున్నాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN