టీ20 వరల్డ్‌కప్‌ బరిలో పపువా న్యూ గినియా

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-29 06:35:37

దుబాయ్‌: వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌నకు పపువా న్యూగినియా (పీఎన్‌జీ) అర్హత సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-ఎలో కెన్యాపై పీఎన్‌జీ 45 పరుగులతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో గెలవడంతోపాటు నెదర్లాండ్స్‌ మ్యాచ్‌పై కూడా ఫలితం ఆధారపడింది. ఆదివారం కెన్యాతో మ్యాచ్‌లో పీఎన్‌జీ ఒకదశలో 19/6తో పీకల్లోతు కష్టాల్లో పడ్డప్పుడు నార్మన్‌ వనువా (54) ధనాధన్‌ బ్యాటింగ్‌తో 19.3 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. అయితే, కెన్యా 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ స్కోరు 130/8ని నెదర్లాండ్స్‌ 17 ఓవర్లలో 131/6తో ఛేదించింది. కానీ, 12.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని ఉంటే నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా నెదర్లాండ్స్‌ అర్హత సాధించి ఉండేది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD