టీ20 విశ్వకప్‌నకు నెదర్లాండ్స్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-30 07:06:00

img
దుబాయ్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి నెదర్లాండ్స్ జట్టు అర్హత సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీ ప్లేఆఫ్‌లో యూఏఈని 8 వికెట్ల తేడాతో ఓడించిన డచ్ టీమ్ పొట్టి ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. నెదర్లాండ్ బౌలర్లు బ్రెండన్ గ్లోవర్ (4/12), మీకెరెన్ (2/17), గుగ్‌టెన్ (2/13) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 80 పరుగులే చేయగలిగింది. ఆతిథ్య జట్టులో తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు డకౌట్ కాగా.. 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఎనిమిదో స్థానంలో వచ్చిన కెప్టెన్ అహ్మద్ రజా (22) మినహా మరెవరూ 20 పరుగుల మార్కు చేరుకోలేకపోయారు. ఇక స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్ 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. దీంతో పపువా న్యూగినియా, ఐర్లాండ్ తర్వాత టీ20 ప్రపంచకప్‌నకు క్వాలిఫయింగ్ పోటీల ద్వారా అర్హత సాధించిన మూడో జట్టుగా నెదర్లాండ్ నిలిచింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN