టీ20 సిరీస్‌కు బంగ్లా జట్టు ఇదే!

Prajasakti

Prajasakti

Author 2019-10-18 02:49:41

img

ఢాకా : భారత్‌తో టీ20 సిరీస్‌లో తలపడే బంగ్లాదేశ్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది. షకీబ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడంతోపాటు 33 ఏళ్ల సన్నీ మూడేళ్ల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. సన్నీ 2016 ఐసిసి టీ20 ప్రపంచకప్‌లో సస్పెన్షన్‌కు గురైన తర్వాత బంగ్లా జట్టుకు ఎంపిక య్యాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగం గా నవంబర్‌ 3న న్యూఢిల్లీ, 7న రాజ్‌కోట్‌, 10న నాగ్‌పూర్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
బంగ్లా జట్టు : షకీబ్‌(కెప్టెన్‌), తమిమ్‌ ఇక్బాల్‌, లింటన్‌ దాస్‌, సౌమ్యా సర్కార్‌, నయీమ్‌ షేక్‌, ముష్ఫికర్‌ రహీమ్‌(వికెట్‌ కీపర్‌), మహ్మదుల్లా, అఫిప్‌ హొసైన్‌, ముసద్దెక్‌ హొసైన్‌, అమీనుల్‌ ఇస్లామ్‌, అరాఫత్‌ సన్నీ, మహ్మద్‌ సైఫుద్దీన్‌, అల్‌-అమిన్‌, ముస్తఫిజుర్‌ రహమాన్‌, షఫీవుల్‌ ఇస్లామ్‌.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN