టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన రోహిత్ డక్‌ ఔట్

Nava Telangana

Nava Telangana

Author 2019-09-28 15:43:00

హైదరాబాద్‌: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ(0: 2 బంతులు) ఓపెనర్‌గా విఫలమయ్యాడు. వామప్‌ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ మధ్య మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌతాఫ్రికా 64 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. సఫారీలతో టెస్టు సిరీస్‌కు ఓపెనర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న రోహిత్‌ కేవలం రెండు బంతులే ఆడాడు. ఫిలాండర్‌ బౌలింగ్‌లో కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. సన్నాహక మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావించిన హిట్‌మ్యాన్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(10: 38 బంతుల్లో 1ఫోర్‌), ప్రియాంక్‌ పాంచల్‌(0) క్రీజులో ఉన్నారు. 10.5 ఓవర్లలో భారత్‌ 2 వికెట్లకు 23 రన్స్‌ చేసింది. మరో ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌(13: 25 బంతుల్లో 2ఫోర్లు) రబాడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమ్‌ ఇండియా 256 పరుగుల వెనుకంజలో ఉంది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN