టెస్టు సీరీసూ మనదే..!

Newwaves

Newwaves

Author 2019-10-14 09:57:00

img

పుణే: ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడుతున్న టీమిండియా పర్యాటక దక్షిణాఫ్రికాతో టెస్టు సీరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఆదివారం పుణె వేదికగా ముగిసిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మ్యాచ్‌ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 326 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన భారత్‌ మళ్లీ బ్యాటింగ్‌ చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే.. ఆదివారం ఉదయం కెప్టెన్‌ కోహ్లీ ప్రత్యర్థిని ఫాలో ఆన్‌ ఆడించేందుకు సిద్ధమయ్యాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 67.2 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలిపోయింది. డీన్‌ ఎల్గర్‌ (72 బంతుల్లో 48- 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. బవుమా (63 బంతుల్లో 38- 4 ఫోర్లు, సిక్స్‌), ఫిలాండర్‌ (72 బంతుల్లో 37- 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొద్దిగా పోరాడారు. అజేయ డబుల్‌ సెంచరీ సాధించిన టీమిండియా సారథి కోహ్లీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఇరు జట్ల మధ్య సీరీస్‌లో చివరిది.. మూడో టెస్టు ఈ నెల 19 నుంచి రాంచీలో జరుగుతుంది.

కాగా.. సొంతగడ్డపై కోహ్లీ సేనకు ఇది వరుసగా 11వ విజయం. ఇన్ని సీరీస్ విజయాలతో టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఫలితంగా ప్రపంచ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ మరింత పైపైకి దూసుకెళ్ళింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN