టెస్ట్‌‌‌‌ కెప్టెన్సీలో విరాట్ కేక

V6velugu

V6velugu

Author 2019-09-30 07:30:56

img

అసాధారణ బ్యాటింగ్‌‌ నైపుణ్యంతో ప్రపంచ రికార్డులను తిరుగరాస్తున్న విరాట్‌‌ కోహ్లీ… టెస్ట్‌‌ కెప్టెన్సీలోనూ కేక పుట్టిస్తున్నాడు..!  గతంలో ఎవరికీ సాధ్యంకానీ, ఎవరూ అందుకోని ఘనతలను సొంతం చేసుకుని ఇతర జట్ల సారథులకు దడ పుట్టిస్తున్నాడు..! ఇంకా ధోనీ నీడలోనే కొనసాగుతున్నాడని విమర్శలు వస్తున్నా… ఐపీఎల్‌‌ ఫెయిల్యూర్‌‌ను సాకుగా చూపుతున్నా… ఇంటర్నేషనల్‌‌ స్థాయిలో మాత్రం విరాట్‌‌ కెప్టెన్సీ గణాంకాలు అదుర్స్‌‌ అనిపిస్తున్నాయి..! పాత తరంలో ఓ నలుగురు కాస్త మెరుగైన స్టాట్స్‌‌తో కొద్దిగా ముందున్నా.. సమకాలిన క్రికెట్‌‌లో మాత్రం విరాట్‌‌ను కొట్టే మొనగాడే లేడంటే అతిశయోక్తి కాదు..! మరి ఆ గణాంకాలేంటో ఓసారి చూద్దాం!!

‘26.33’..  ఇది విరాట్‌‌ కోహ్లీ నాయకత్వంలోని ఇండియా టెస్ట్‌‌ జట్టు బౌలింగ్‌‌ యావరేజ్‌‌. అంటే ప్రతీ 26 పరుగులకు ఒక వికెట్‌‌ అన్నమాట. ఈ అంశంలో 30 అంతకంటే ఎక్కువ టెస్ట్‌‌ మ్యాచ్‌‌ల్లో జట్టుకు నాయకత్వం  వహించిన కెప్టెన్ల అందరి లిస్ట్‌‌ను చూస్తే  కోహ్లీ కంటే ముందు నలుగురే ఉన్నారు.  వాళ్లలో 21.94 సగటుతో వివ్‌‌ రిచర్డ్స్‌‌(వెస్టిండీస్‌‌) టాప్‌‌లో ఉండగా హ్యాన్సీ క్రానే (సౌతాఫ్రికా), మైక్‌‌ బ్రియర్లీ, పీటర్‌‌ మే (ఇంగ్లండ్‌‌) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత స్థానం విరాట్‌‌దే. ఇయాన్‌‌ చాపెల్‌‌, క్లైవ్‌‌ లాయిడ్‌‌, స్టీవ్‌‌ వా, రికీ పాంటింగ్‌‌ కంటే బలమైన బౌలింగ్‌‌ దళం వల్లే విరాట్‌‌ ఈ ఘనతలను సాధించాడు. టీమిండియా గత కెప్టెన్లతో పోలిస్తే టెస్టుల్లో విరాట్‌‌ అప్రతిహత విజయాల వెనుక రహస్యం కూడా ఇదే. ఇప్పుడు ప్రతిష్టాత్మక వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మొదలైంది. సారథిగా దీనిపై కచ్చితంగా విరాట్‌‌ ప్రభావం చూపుతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సక్సెస్‌‌ఫుల్‌‌ కెప్టెన్‌‌..

టీమిండియా కెప్టెన్‌‌గా విరాట్‌‌ 48 టెస్ట్‌‌లకు గాను 28 మ్యాచ్‌‌ల్లో టీమ్‌‌ను గెలిపించాడు. మిగతా వారితో పోలిస్తే అతనే నంబర్‌‌వన్‌‌. ప్రపంచ వ్యాప్తంగా 30 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌‌ల్లో జట్టును నడిపించిన కెప్టెన్ల విజయాల శాతాన్ని పరిశీలిస్తే  స్టీవ్‌‌ వా, రికీ పాంటింగ్‌‌  తర్వాత 58.33 సగటుతో కోహ్లీ మూడో ప్లేస్‌‌లో నిలిచాడు. ధోనీ 20, సౌరవ్‌‌ గంగూలీ 22వ ప్లేస్‌‌లో ఉన్నారు. బౌలింగ్‌‌ బలగం విషయంలో బెస్ట్‌‌ ఇండియన్‌‌ టీమ్‌‌గా నిలిచిన కోహ్లీ టీమ్‌‌..  బ్యాటింగ్‌‌ అంశంలో మాత్రం కాస్త వెనుకంజలో ఉంది. బ్యాటింగ్‌‌ యావరేజ్‌‌లో గంగూలీ నాయకత్వంలోని టెస్ట్‌‌ జట్టు 38.74తో టాప్‌‌ ప్లేస్‌‌లో ఉండగా, విరాట్‌‌ సేన 37.48తో రెండో స్థానంలో ఉంది. ధోనీ జట్టు సగటు 37.00 కాగా, గావస్కర్‌‌ (37.90), కపిల్‌‌దేవ్ (36.13), పటౌడీ (28.19) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌‌లో ధోనీ వేసిన బీజాన్ని…  సారథిగా మారిన తర్వాత బౌలింగ్‌‌ విభాగాన్ని కోహ్లీ మరింత బలోపేతం చేసుకున్నాడు. పటౌడీ కెప్టెన్సీలో బౌలింగ్‌‌ సగటు 32.50 కాగా, గావస్కర్‌‌ సారథ్యంలో 36.38గా ఉంది. కానీ కోహ్లీ వరకు వచ్చేసరికి ఇది 26.33గా మారింది. ఉపఖండం బౌలర్లు స్పిన్‌‌కే పరిమితం అనే స్థాయి నుంచి విదేశాల్లోనూ చెలరేగే సత్తా, సామర్థ్యం, నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్దాడు. ఫిట్‌‌నెస్‌‌ పరంగా, ఆట పరంగా ప్రపంచ స్థాయిని అందుకునేలా చేశాడు.

ఓ రకంగా చెప్పాలంటే ఇండియా గత కెప్టెన్లకు విరాట్‌‌కు ఉన్న ప్రధాన తేడా ఇదే. ఉదాహరణకు ఇషాంత్‌‌శర్మను తీసుకుంటే ధోనీ హయాంలో అతను పెద్దగా రాణించలేదు. చిన్నచిన్న లోపాల వల్ల పూర్తి సత్తాను బయటకు తీయలేకపోయాడు. ఇషాంత్‌‌కు బాల్‌‌ ఇస్తే ధోనీ డీప్‌‌ పాయింట్‌‌లో కచ్చితంగా ఫీల్డర్‌‌ను పెట్టేవాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే రన్స్‌‌ ఎక్కువగా ఇస్తాడని కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కోహ్లీ అండతో భరత్‌‌ అరుణ్‌‌ పర్యవేక్షణలో ఇషాంత్‌‌ రాటుదేలాడు. వేగం, స్వింగ్‌‌, బౌన్స్‌‌.. ఇలా వరుసపెట్టి రకరకాల బంతులు సంధించగల పేసర్‌‌గా మారాడు. ముఖ్యంగా  లెఫ్ట్​ హ్యాండ్​ బ్యాట్స్​మెన్​ను ఔట్‌‌ చేయాలంటే మొదట గుర్తొచ్చే బౌలర్​గా మారాడు. విరాట్​ కెప్టెన్సీలో ఓవరాల్‌‌గా 8 మంది బౌలర్లలో ఏడుగురు 30 అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించగా, వారి సగటు 30 కంటే తక్కువగా ఉండటం విశేషం. అదే ధోనీ కెప్టెన్సీలో 30 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు 10 మంది ఉంటే వారిలో ఒకే ఒక్కరి సగటు 30 లోపు ఉంది.

img

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD