టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో స్మిత్‌కు చేరువలో కోహ్లీ

Prajasakti

Prajasakti

Author 2019-10-15 02:27:55

img

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) సోమవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ స్మిత్‌కు చేరువలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండోటెస్ట్‌లో అజేయ ద్విశతకం బాదిన కోహ్లీ 936 రేటింగ్‌ పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. తొలిటెస్ట్‌లో 899 పాయింట్లతో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌(937 పాయింట్లు)కు కోహ్లీ ఒక్క పాయింట్‌ దూరంలో మాత్రమే నిలిచాడు. మూడోటెస్ట్‌లోనూ రాణిస్తే కోహ్లీ టెస్టుల్లో తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయం. పుజరా(4), రహానె(9), మయాంక్‌ అగర్వాల్‌(17)వ స్థానాల్లో కొనసాగుతు న్నారు. బౌలర్ల జాబితాలో అశ్విన్‌ మూడు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి, దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడ 2వ, ఫిలాండర్‌ 8వ స్థానంలో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 2వ స్థానంలో కొనసాగుతున్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN