టెస్ట్ కెప్టెన్ గా కొహ్లీ 50మ్యాచ్ ల రికార్డు

Teluguglobal

Teluguglobal

Author 2019-10-10 09:44:50

img

  • పూణే టెస్టుతో కెప్టెన్ గా హాఫ్ సెంచరీ

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 50 మ్యాచ్ ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రెండో ఆటగాడిగా విరాట్ కొహ్లీ నిలువబోతున్నాడు. సౌతాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా గురువారం ప్రారంభమయ్యే రెండోటెస్టుతో..కెప్టెన్ గా కొహ్లీ 50 మ్యాచ్ ల మైలురాయిని చేరనున్నాడు.

img

సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 49 టెస్టుల రికార్డును అధిగమించి ..గతంలో ఇదే ఘనత సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతి స్థానంలో నిలువనున్నాడు.

img

2008 నుంచి 2014 మధ్యకాలంలో భారతజట్టు 60 టెస్టుల్లో ధోనీ నాయకత్వం అందించగా..2014 నుంచి ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్ వరకూ విరాట్ కొహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

img

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా 3వ ర్యాంకర్ సౌతాఫ్రికాతో జరుగుతున్న తీన్మార్ టెస్ట్ సిరీస్ తొలిమ్యాచ్ లో భారీవిజయం సాధించిన భారత్ 1-0 ఆధిక్యంతో పైచేయి సాధించింది

img

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD