టెస్ట్ క్రికెట్లో టాస్ పై వివాదం

Teluguglobal

Teluguglobal

Author 2019-10-31 01:03:10

img

  • టాస్ తో అసమతౌల్యమే అంటున్న ఫాబ్ డూప్లెసీ

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ తో ముగిసిన తీన్మార్ టెస్ట్ సిరీస్ లో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా కెప్టెన్ ఫాబ్ డూప్లెసీ…టాస్ ను వివాదానికి కేంద్రబిందువుగా మార్చాడు. ఐదురోజుల క్రికెట్లో అసలు టాస్ ఎందుకంటూ ప్రశ్నించాడు.

భారత ఉపఖండ దేశాలలో….ప్రధానంగా భారత గడ్డపై టాస్ నెగ్గకపోతే మ్యాచ్ నెగ్గలేమని..ఇది అన్ని విదేశీ జట్లకూ అనుభవమేనంటూ ఏకరువు పెట్టాడు.

img

భారత్ తో ముగిసిన సిరీస్ లో మూడుకు మూడు టెస్టుల్లోనూ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీనే టాస్ నెగ్గాడు. చివరకు రాంచీ వేదికగా జరిగిన ఆఖరిటెస్టులో టాస్ కు తనతో పాటు వైస్ కెప్టెన్ టెండు బవుమాను సైతం సౌతాఫ్రికా కెప్టెన్ వెంట తెచ్చుకొన్నా అదృష్టం మాత్రం కలసిరాలేదు.

మూడుటెస్టుల్లోనూ అదే సీన్..

img

భారతగడ్డపై అదృష్టవశాత్తు టాస్ నెగ్గిన జట్లే విజేతలుగా నిలవడం సాధారణ విషయమేనని…టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని రెండున్నర రోజుల్లో 500 పరుగులు సాధించడం, మూడోరోజు ఆఖరిగంటలో డిక్లేర్ చేయడం…ప్రత్యర్థిజట్టు వెలుతురు సరిగాలేని వాతావరణంలో బ్యాటింగ్ కు దిగి వికెట్లు కోల్పోడం ద్వారా అనవసరపు ఒత్తిడికి గురికావడం ఆనవాయితీగా మారిపోయిందని.. టాస్ నెగ్గిన జట్టుకు స్థానబలంతో పాటు.. వాతావరణానికి అనుకూలంగా వికెట్లను
తయారు చేసుకొనే వెసలుబాటు ఉంటుందని డూప్లెసీ అంటున్నాడు.

విజయం కోసం రెండుజట్లకూ సమాన అవకాశాలు ఉండాలని…టాస్ నెగ్గడంతోనే ఒక జట్టు సగం మ్యాచ్ నెగ్గితే..మరో జట్టు సగం మ్యాచ్ ఓడిపోవడం ఎంతవరకూ న్యాయమని సఫారీ కెప్టెన్ ప్రశ్నిస్తున్నాడు.

విదేశీ జట్లకే చాన్స్…

img

టెస్ట్ క్రికెట్లో టాస్ వేసే సాంప్రదాయాన్ని తొలగించాలని…విదేశీ గడ్డపై ఆడుతున్న జట్లకు మాత్రమే..బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ ఎంచుకొనే వెసలుబాటు కల్పించిన నాడే.. సమన్యాయం, సమాన అవకాశాలు ఉంటాయని అన్నాడు.

img

శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ గడ్డపై సిరీస్ లు ఆడిన సౌతాఫ్రికా మొత్తం పదికి పది టెస్టుల్లోనూ టాస్ ఓడటం విశేషం.

అయితే…బొమ్మా…బొరుసా లేని క్రికెట్ ను… ప్రధానంగా సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ లను ఊహించడం కష్టమే మరి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD