టెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ జోరు

Teluguglobal

Teluguglobal

Author 2019-10-08 02:20:16

img

  • 38 పాయింట్లు కోల్పోయిన విరాట్ కొహ్లీ
  • టాప్ -10 లో రవిచంద్రన్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ టాపర్ భారత్ కు…విశాఖ టెస్ట్ ముగిసిన తర్వాత ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ మిశ్రమఫలితాలను ఇచ్చాయి. డాషింగ్ ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తమతమ ర్యాంకులను గణనీయంగా మెరుగుపరచుకోగా… కెప్టెన్ విరాట్ కొహ్లీ ర్యాంకింగ్ పాయింట్లు మాత్రం మ్యాచ్ మ్యాచ్ కూ తగ్గిపోతు వస్తున్నాయి.

img

ఐసీసీ వెలువరించిన టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం రోహిత్ శర్మ 36 స్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగు పరచుకొన్నాడు. విశాఖపట్నం వేదికగా సౌతాప్రికాతో ముగిసిన తొలిటెస్టు తొలిఇన్నింగ్స్ లో 176, రెండో ఇన్నింగ్స్ లో 127 పరుగులు సాధించడంతో పాటు…13 సిక్సర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పడం ద్వారా భారీగా ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 17వ ర్యాంకులో నిలిచాడు.

img

మరో ఓపెనర్, డబుల్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 25వ ర్యాంక్ సాధించాడు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం 38 పాయింట్ల మేరకు కోల్పోయి…టాప్ ర్యాంకర్ స్టీవ్ స్మిత్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

టాప్ -10లో అశ్విన్…..

img2018 తర్వాత తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్…విశాఖ మ్యాచ్ లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా టాప్ -10 లో చోటు సంపాదించాడు. గత ఏడాది వరకూ 14వ ర్యాంక్ లో ఉన్న అశ్విన్ ప్రస్తుతం 10వ ర్యాంక్ సాధించాడు.

img

విశాఖ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీ 710 ర్యాంకింగ్ పాయింట్లతో 18వ ర్యాంక్ లో నిలిచాడు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా రెండో ర్యాంక్ సాధించడం విశేషం.

img

img

బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో స్టీవ్ స్మిత్, బౌలర్ల ర్యాంకింగ్స్ లో యాండీ కమిన్స్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.img

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD