టైటాన్స్‌కు భారీ విజయం

Prajasakti

Prajasakti

Author 2019-09-27 02:35:43

img

జైపూర్‌: తెలుగు టైటాన్స్‌కు ఊరట విజయం లభించింది. శుక్రవారం జరిగిన పోటీలో జైపూర్‌పై 51-31 పాయింట్ల తేడాతో టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. సిద్ధార్ధ్‌ దేశాయ్‌(22), రజ్‌నీష్‌ దలాల్‌(11) రైడ్‌లలో చెలరేగడంతో పాటు ఆరుసార్లు జైపూర్‌ను ఆలౌట్‌ కూడా చేయగలిగారు. ట్యాకిల్స్‌లో 12, రైడ్‌లద్వారా 33 పాయింట్లు గెల్చుకొని టైటాన్స్‌ సత్తా చాటింది. ఇక జైపూర్‌ జట్టు రైడ్‌ల ద్వారా 22 పాయింట్లు గెల్చుకున్నా... ట్యాకిల్స్‌లో ఘోరంగా విఫలమై కేవలం 6 పాయింట్లు మాత్రమే సాధించ గల్గింది. మరో పోటీలో బెంగళూరు బుల్స్‌ 35-33తో యు ముంబాను చిత్తుచేసింది. బెంగళూరు రైడర్‌ పవన్‌కుమార్‌ (11), బంటీ(6) సత్తాచాటగా... యు ముంబ జట్టులో అభిషేక్‌ సింగ్‌(10) రాణించాడు. రైడ్‌లో యు ముంబ(23), ట్యాకిల్స్‌లో బెంగళూరు 10 పాయింట్లను గెల్చుకోగా... నాలుగు సార్లు బెంగళూరు జట్టు ప్రత్యర్ధి జట్టును ఆలౌట్‌ చేసి గెలుపుకు బాటలు వేసుకుంది. శనివారం హర్యానా - యుపి, గుజరాత్‌- తలైవాస్‌ జట్ల మధ్య పోటీలుజరగను న్నాయి.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN