టై అయితే...సూపర్‌ ఓవర్‌తోనే..!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-15 06:13:23

దుబాయ్‌: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ విజేతను బౌండరీల సంఖ్య ఆధారంగా నిర్ణయించడంతో ఐసీసీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో సూపర్‌ ఓవర్‌ రూల్‌లో ఐసీసీ మార్పులు చేసింది. మేజర్‌ టోర్నీ ల్లో స్కోర్లు సమమైతే సూపర్‌ ఓవర్‌ ద్వారానే విజేతను తేల్చనుంది. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఉపయోగించిన ఈ నిబంధనపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఐసీసీ దిద్దుబాటుకు దిగింది. ఇకపై వన్డే, టీ20 వరల్డ్‌కప్‌ల్లో స్కోర్లు సమమైతే విజేతను సూ పర్‌ ఓవర్ల ద్వారానే తేల్చనున్నారు. గ్రూప్‌ దశలో సూపర్‌ ఓవర్‌లో కూడా స్కోర్లు సమమైతే మ్యాచ్‌ను టైగా ప్రకటిస్తారు. కానీ సెమీస్‌, ఫైనల్లో స్కోర్లు సమమైతే.. సూపర్‌ ఓవర్‌ నిర్వహిస్తారు. అందులోనూ సమమైతే ఏదో ఒక టీమ్‌ ఎక్కువ స్కోరు చేసేంత వరకు సూపర్‌ ఓవర్లు కొనసాగుతూనే ఉంటాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN