డబ్యూటిఎ ఫైనల్స్‌ విజేత బార్టీ

Prajasakti

Prajasakti

Author 2019-11-04 03:02:49

img

షెంజెన్‌ (చైనా) : ఆస్ట్రేలియా టెన్నిస్‌ సంచలనం ఆష్లీ బార్టీ మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం డబ్ల్యూటిఎ ఫైనల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నిలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఎలినా స్వితోలినాపై 6-4, 6-3 స్కోరుతో బార్టీ విజయం సాధించింది. బార్టీ కెరీర్‌లో ఎలినాపై ఇదే మొదటిసారి విజయం సాధించడం. ఆదివారం ఒక గంట, 26 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో వరస సెట్లలో బార్టీ సంచలనం విజయం సాధించింది. దీంతో డబ్ల్యూటిఎ ఫైనల్స్‌ టైటిల్‌ గెలుచుకున్న రెండో ఆస్ట్రేలియన్‌గా నిలిచింది. 1976లో ఆస్ట్రేలియా నుంచి ఎవోన్నే గూలగాంగ్‌ కావ్లీ డబ్ల్యూటిఎ ఫైనల్స్‌ టైటిల్‌ సాధించిన తరువాత ఆ దేశం నుంచి మళ్లీ బార్టీ మాత్రమే ఈ టైటిల్‌ సాధించింది. ఈ ఏడాది జూన్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ విజయంతో బార్టీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌కు చేరుకున్న ఏకైక ఆస్ట్రేలియన్‌ బార్టీ మాత్రమే.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD