డాన్ బ్రాడ్‌మ్యాన్ రికార్డును సమం చేసిన రోహిత్

Nava Telangana

Nava Telangana

Author 2019-10-03 00:08:00

విశాఖ : సౌతాఫ్రికాతో ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తొలిసారిగా టెస్టుల్లో ఓపెనింగ్‌కి చేసిన రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. జట్టు సభ్యులు తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి.. పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఈ క్రమంలో ఓ ఊహించని రికార్డు రోహిత్ ఖాతాలో చేరింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మ్యాన్ సాధించిన ఓ అరుదైన రికార్డును రోహిత్ సమం చేశాడు. 50 ఇన్నింగ్స్ తర్వాత స్వదేశంలో బ్రాడ్‌మ్యాన్‌, రోహిత్ ఇద్దరి రికార్డులు 98.22గా నమోదైంది. అంతేకాక, రోహిత్ వరుసగా టెస్టుల్లో ఆరుసార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఈ సందర్భంగా రోహిత్ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. నాకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాను. దాని గురించి నేను అప్రమత్తంగా ఉన్నాను. నాకు పరుగులు చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది అని రోహిత్ అన్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN