డీఆర్‌ఎస్ లో ఎప్పుడూ ఫెయిలే..

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-20 06:30:07

విరాట్‌ కోహ్లీ తాను అవుటైన సందర్భంలో డీఆర్‌ఎస్‌ను ఎప్పుడు కోరినా ప్రతికూల ఫలితమే రావడం ఆనవాయితీగా వస్తోంది. టెస్టు ఫార్మాట్‌లో ఇప్పటికి వరుసగా తొమ్మిదోసారి డీఆర్‌ఎ్‌సలో నిరాశనే ఎదుర్కోవాల్సి వచ్చింది. 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టులో తొలిసారి డీఆర్‌ఎ్‌సకు వెళ్లాడు. అప్పటి నుంచి ఇప్పటి మూడో టెస్టు వరకు అదే తంతు. ఈ మ్యాచ్‌ 16వ ఓవర్‌లో పేసర్‌ నోర్టే వేసిన బంతికి కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే ఈ ఎల్బీపై రోహిత్‌తో చర్చించిన కోహ్లీ రివ్యూకు వెళ్లాడు. బంతి లెగ్‌ స్టంప్‌కు ఆవలిగా వెళ్తున్నదేమోనని విరాట్‌ భావించగా.. అది లెగ్‌ వికెట్‌ బెయిల్‌ను తాకుతున్నట్టు రీప్లేలో తేలింది. థర్డ్‌ అంపైర్‌ కూడా ఫీల్డ్‌అంపైర్‌ కాల్‌కే మొగ్గు చూపడంతో నిరాశ తప్పలేదు. కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న నోర్టేకిది తొలి వికెట్‌ కావడం విశేషం.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD