డీన్‌ ఎల్గ‌ర్ సెంచ‌రీ...

Nava Telangana

Nava Telangana

Author 2019-10-04 15:40:00

హైద‌రాబాద్‌: వైజాగ్ టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ డీన్‌ ఎల్గ‌ర్ సెంచ‌రీ చేశాడు. ఎల్గ‌ర్ సెంచ‌రీలో మొత్తం 11 ఫోర్లు, నాలుగు సిక్స‌ర్లు ఉన్నాయి. 2010 త‌ర్వాత ఇండియా పిచ్‌ల‌పై ఓ సౌతాఫ్రికా ప్లేయ‌ర్ టెస్టుల్లో సెంచ‌రీ చేయ‌డం ఇదే మొద‌టిసారి. ఈ మ్యాచ్‌లో ఎల్గ‌ర్ కీల‌క పాత్ర పోషించాడు. ఒక‌వైపు వికెట్లు ప‌డుతున్నా.. ఎల్గ‌ర్ మాత్రం ధీటుగా భార‌త బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫాలోఆన్ నుంచి త‌మ జ‌ట్టును ర‌క్షించేందుకు ఎల్గ‌ర్ త‌న వంత ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న ద‌క్షిణాఫ్రికా ప్ర‌స్తుతం 63 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 198 ర‌న్స్ చేసింది. ఎల్గ‌ర్ 105, డికాక్ 7 ర‌న్స్‌తో క్రీజ్‌లోనే ఉన్నారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN