డే అండ్ నైట్ టెస్టు నిర్వహిద్దాం

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-29 03:53:00

img

న్యూఢిల్లీ/ఢాకా: భారత్-బంగ్లాదేశ్ మధ్య వచ్చే నెల 22-26వ తేదీ మధ్య కోల్‌కతాలో జరగాల్సిన రెండో టెస్టును డే అండ్ నైట్‌గా నిర్వహిద్దామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు విజ్ఞప్తి చేశాడు. ఇదే జరిగితే ఇరు దేశాలకు ఇదే తొలి పింక్ బాల్ మ్యాచ్ అవుతుంది. తన విన్నపాన్ని బీసీబీ అంగీకరిస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. దీనిపై సీనియర్ ఆటగాళ్లతో చర్చించాక.. బీసీబీ నిర్ణయం తీసుకోనుంది. డై అండ్ నైట్ టెస్టు నిర్వహించాలన్న ఆలోచన మంచిదే కానీ, గులాబీ బంతితో ఆటగాళ్లకు సరైన సన్నాహాలు లేకపోవడం, ప్రాక్టీస్‌కు సమయం తక్కువ ఉండడం వంటి కొన్ని సమస్యలు ఉన్నాయని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అక్రమ్ ఖాన్ చెప్పాడు. బీసీబీ నిర్ణయం తీసుకున్న వెంటనే డే అండ్ నైట్ టెస్టు నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసేందుకు బీసీసీఐ సంసిద్ధంగా ఉంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN