డే నైట్‌లో ధోని వ్యాఖ్యానం?

Nava Telangana

Nava Telangana

Author 2019-11-07 03:03:58

కోల్‌కత : టీమ్‌ ఇండియా తొలి డే నైట్‌ (గులాబీ బంతి) టెస్టుకు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 22 నుంచి కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ తన తొలి డే నైట్‌ టెస్టును ఆడనుంది. బంగ్లాదేశ్‌కు సైతం ఇదే తొలి గులాబీ బంతి పోరు కానుండటం విశేషం. కోల్‌కత డే నైట్‌ టెస్టుకు మరో సరికొత్త కళ రానుందని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి. భారత దిగ్గజ కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోని ఈడెన్‌ గార్డెన్స్‌లో అతిథి వ్యాఖ్యాతగా వ్యవ హరించనున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. దక్షిణాఫ్రికాతో రాంచి టెస్టు సందర్భంగా స్టేడియానికి వచ్చి డ్రెస్సింగ్‌రూమ్‌లో యువ ఆటగాళ్లతో మాట్లాడిన మహి.. కోల్‌కతలో అతిథి వ్యాఖ్యా నంతో గులాబీ పోరుకు మరింత గుబాళింపు తీసుకురానున్నాడు. ధోని వ్యాఖ్యానంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD