డే/నైట్‌ టెస్టులకు కోహ్లీ సిద్ధమే!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-26 05:05:12

img

కోల్‌కతా: సమీప భవిష్యత్‌లో భారత జట్టు డే అండ్‌ నైట్‌ టెస్టులు ఆడడం ఖాయమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ఈ తరహా టెస్టులను ఆడేందుకు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఆసక్తిగా ఉన్నాడని తెలిపాడు. ‘పింక్‌ బాల్‌ టెస్టులు ఆడేందుకు కోహ్లీ కూడా ఇష్టపడుతున్నాడు. డే అండ్‌ నైట్‌ టెస్టులపై కోహ్లీ విముఖత చూపుతున్నట్టు గతంలో వచ్చిన కథనాలన్నీ అబద్ధం. కెప్టెన్‌ నుంచి సానుకూలత వ్యక్తమైతే ఈ తరహా టెస్టులకు మార్గం మరింత సులువైనట్టే. భారత జట్టు గులాబీ టెస్టు ఎప్పుడు ఆడుతుందనేది కచ్చితంగా చెప్పలేను కానీ నేను పదవిలో ఉన్న సమయంలోనే గట్టిగా కృషి చేస్తా’ అని ఈడెన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో గంగూలీ వివరించాడు. అయితే భారత జట్టు స్వదేశంలో టెస్టు సిరీస్‌ వచ్చే ఏడాది చివర్లో ఆడే అవకాశం ఉంది. కానీ అప్పటికి దాదా పదవీకాలం ముగియనుంది.

ఎన్‌సీఏను పునరుద్ధరించాలి: లక్ష్మణ్‌

వర్ధమాన క్రికెటర్లను రాటుదేల్చేలా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)ని పునరుద్ధరించాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని లక్ష్మణ్‌ కోరాడు. కొన్నేళ్లుగా గాయపడిన ఆటగాళ్లకు పునరావాస శిబిరంగానే ఎన్‌సీఏ ఉపయోగపడుతోంది. ‘ఎన్‌సీఏను తిరిగి ట్రాక్‌పైకి తీసుకురాగల సామర్థ్యం గంగూలీకి ఉంది. ప్రస్తుత భారత జట్టు పటిష్ఠంగా ఉండడానికి కారణం రిజర్వ్‌ బెంచ్‌. ఇటీవల దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడడానికి అక్కడి దేశవాళీ నిర్మాణం సరిగా లేకపోవడమే. కానీ భారత్‌లో అలా కాదు. ఇక ఎన్‌సీఏ ద్వారా సుదీర్ఘకాలం భవిష్యత్‌ చాంపియన్లను తయారు చేసుకోవచ్చు’ అని లక్ష్మణ్‌ అన్నాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD